సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ నగరం తో ఎంతటి అనుబంధం ఉందొ అందరికి తెలిసిందే.. అయితే హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రజల్ని రక్షించడానికి మెట్రో రైలు పుణ్యమా అని ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో ప్రయాణిస్తున్నారు.అయితే, సాధారణ బస్ ఛార్జీలతో పోల్చుకుంటే మెట్రో ఛార్జీలు కొంచెం అధికంగా ఉంటాయి. దీనితో మెట్రో యజమాన్యం తాజగా మెట్రో ఛార్జీలను తగ్గించింది. తగ్గిన ఛార్జీలు రేపు శనివారం నుంచి అమలు కానున్నాయి.తగ్గిన మెట్రో ఛార్జీల ప్రకారం.. కనీస ధర 11 రూపాయలుగా కాగా.. గరిష్ట ధర 69 రూపాయలుగా ఉంది. రెండు కిలోమీటర్ల వరకు మెట్రో ఛార్జీని 12 రూపాయల నుంచి 11 రూపాయలకు తగ్గించారు. 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు ఛార్జీని 18 రూపాయల నుంచి 17 రూపాయలకి.. 4 నుంచి 6 కిలో మీటర్ల వరకు ఛార్జీని 30 నుంచి 28 రూపాయలకు..12 నుంచి 15 కిలోమీటర్ల వరకు ఛార్జీ 55 నుంచి 51 రూపాయలకు.. 15 నుంచి 18 కిలోమీటర్ల ఛార్జీ 60 నుంచి 56 రూపాయలకు.. 18 నుంచి 21 కిలోమీటర్ల ఛార్జీ 66 నుంచి 61 రూపాయలకు..21 నుంచి 24 కిలోమీటర్ల ఛార్జీని 70 నుంచి 65 రూపాయలకు.. 24 కిలోమీటర్లకు పైగా ఉండే ప్రయాణ ఛార్జీ 75 రూపాయల నుంచి 69 రూపాయలకు తగ్గించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *