సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో వైసీపీ శ్రేణులు ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ , కామన నాగేశ్వర రావు, భీమవరం ఎంపీపీ నరసింహరాజు, వేండ్ర వెంకట స్వామి, చినమిల్లి వెంకట్రాయుడు, కోడె యుగంధర్ గంట సుందర కుమార్, మాజీ కౌన్సెలర్స్ తదితర వైసీపీ నేతల ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా పాదయాత్ర చేస్తూ ( వీరితో రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్య మోషేను రాజు కొద్దీ సేపు గడిపి విన్నతి పత్రం అందుకొన్నారు) భీమవరంలో స్థానిక ప్రకాశం చౌక్ సెంటర్ భారీ ర్యాలీగా వెన్నుపోటు దినం బ్యానేర్ల తో నినాదంచేసుకొంటూ తాలూకా ఆఫీస్ కు తదుపరి మునిసిపల్ కార్యాలయంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, గత ప్రభుత్వ హయాంలో అమలు అయిన సంక్షేమ పధకాలు అమలు చెయ్యాలని వినతి పత్రాలు అధికారులకు అందజేశారు. తదుపరి వారు మీడియాతో మట్లాడుతూ.. ప్రజలకు వందలాది దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ఏడాది పాలన లో రాష్ట్ర ప్రజలు దగా పడ్డారని గత వైసీపీ పాలనలో జరిగిన ప్రజా సంక్షేమ పధకాలు అన్ని ఎత్తేశారని , సీఎం చంద్రబాబు మాట్లాడితే సంపద సృష్టిస్తానని ప్రజలకు పంచి పెడతానని ఆర్భాటం చేస్తుంటారని, నిజానికి వారి వర్గాలకే తప్ప.. ప్రజలు ఎమి ఇవ్వకుండా లక్షల కోట్ల అప్పులు ఇచ్చారని , దీనికి పవన్ కళ్యణ్ కూడా సహకరించారని ప్రజలు రైతులు విద్యార్థులు మహిళలు అన్ని వర్గాలకు ఏడాదిలో వెన్ను పోటు పొడిచారని, ఉచిత వైద్య విద్య, ఆరోగ్యశ్రీ ఎత్తివేస్తున్నారని సంక్షేమం, ఆరోగ్యం ప్రజలు అన్ని కోల్పోయారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *