సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు,ఆదివారం ఉదయం భీమవరం DNR కళాశాల గన్నాబత్తుల పెద్ద తాత గ్రౌండ్ లో రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాకరంగా జరిగిన 15వ హాకీ ఆంధ్రప్రదేశ్ జూనియర్ మహిళా అంతర్ జిల్లా ఛాంపియన్ షిప్ 2025 ముగింపు కార్యక్రమంలో రాష్ట్రా శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. మహిళలు కూడా అన్ని రంగాలతో పాటు క్రీడా రంగంలోముఖ్యంగా క్రికెట్ మరియు మన జాతీయ క్రీడా హాకీలో కూడా తమ సత్తా చాటుతున్నారని ఇది అభినందనీయం అని విజేతలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న మహిళా హాకీ క్రీడాకారిణిని లందరికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమవరం మండల MPP పేరిచర్ల నర్సింహ రాజు స్థానిక క్రీడా అభిమానులు కూడా పాల్గొన్నారు.
