సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినీ పరిశ్రమకు గత 4 దశాబ్దాలుగా విశేషమైన సేవలందించిన సీనియర్ నిర్మాత మహేంద్ర (ఏ.ఏ ఆర్ట్స్ అధినేత) (A A arts)గత అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహేంద్ర , చికిత్స పొందుతూ మరణించాడు. నేడు గురువారం ఆయన స్వస్థలమైన గుంటూరులో కుటుంబ సభ్యులు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇక ‘ప్రేమించి పెళ్ళి చేసుకో’ అనే మూవీతో నిర్మాతగా మారిన మహేంద్ర ఆ తర్వాత ‘ఆరని మంటలు’, ‘బందిపోటు రుద్రమ్మ’, కృష్ణ చిరంజీవి హీరోల కాంబినేషన్స్ లో ‘తోడు దొంగలు’, ‘ఎదురులేని మొనగాడు’, ‘ఢాకూ రాణి’, ‘ప్రచండ భైరవి’, ‘కనకదుర్గ వ్రత మహాత్మ్యం’ వంటి చిత్రాలతో నిర్మాతగా విజయాన్ని అందుకున్నారు. శ్రీహరి ని హీరోగా పరిచయం చేస్తూ ‘పోలీస్’ చిత్రాన్ని నిర్మించింది, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కాజల్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ తేజ దర్శకత్వంలో ‘ లక్ష్మి కళ్యాణం ను నిర్మించింది కూడా మహేంద్ర కావడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *