సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఫ్రైడే డ్రైడే కార్యక్రమం లో భాగంగా భీమవరం పట్టణ శివారు లోని పెదఅమిరం గ్రామం నందు వినాయక స్వామి గుడి పరిధిలో పలు ప్రాంతాలను సందర్శించి కొన్ని సూచనలు సలహాలు స్థానిక గ్రామా సిబ్బందికి ఇచ్చారు. వానాకాలం అంటువ్యాధుల గురించి వివరించారు, మరియు ఫ్రైడే డ్రైడే గూర్చి దాని యొక్క ప్రాధాన్యం గురించి వివరించారు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని త్రాగునీటి వనరుల గురించి వివరించారు, తధానంతరం గ్రామం లోని గృహలను సందర్శించి నీటి నిల్వలో దోమ గుడ్ల లార్వ కోసం పరీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డా. వీర్ల క్రాంతి కుమార్ మరియు జిల్లా ఎపిడమయోలజిస్ట్ జి.గాతల సుభాష్, కాళ్ళ వైద్యాధికారి డా. సరాబు సునీల్, పి హెచ్ న్ చండి రాణి, ఎం. ఎల్. హెచ్. పి లు ఎ. ఎన్. మ్ లు, హెల్త్ అసిస్టెంట్, ఆశాలు పాల్గొన్నారు
