సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: న్యాయ అవగాహన సదస్సు “వృధ్ధులను దూషించడం చట్టరీత్యా నేరమని, ముసలితనంలో తల్లిదండ్రులను చూడని పిల్లలపై RDOకు ఫిర్యాదు చేస్తే, గతంలో వారికి వ్రాసి ఇచ్చిన ఆస్తుల దస్తావేజును రద్దు చేసి, ఆ ఆస్తిని తల్లిదండ్రులకే తిరిగి ఇస్తారని, పిల్లల నుండి తల్లిదండ్రులు మనోవర్తి పొందవచ్చని, రేషన్ కార్డు లేని కారణంగా వృధ్ధాప్య పెన్షన్ రానివారు సంబంధిత VRO నుండి సర్టిఫికెట్ తీసుకుని, ఆధార్ కార్డు నకలుతో జతచేసి మండల న్యాయ సేవా సంస్ధకు అందజేస్తే సంబంధిత అధికారులకు పంపి వృధ్ధాప్య పెన్షన్ అందేలా చేస్తారని, వృధ్ధులు ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంత శేషజీవితం గడపాలని” భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు యేలేటి యోహాన్ (న్యూటన్) అన్నారు. “ప్రపంచ వృధ్ధుల దూషణ వ్యతిరేక దినోత్సవం” సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో చిన అమిరంలో ఉన్న శ్రీ స్వామి యోగీశ్వరానంద గిరి విశ్వ శాంతి వృధ్ధుల సంక్షేమ కేంద్రంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థ నిర్వాహకులు భూపతిరాజు సత్యనారాయణ రాజు మాట్లాడుతూ వృద్దాశ్రమం 2009లో కేవలం ఎనిమిది మందితో ఏర్పాటు చేసామని, ప్రస్తుతం 90 మంది వరకూ ఆశ్రయం పొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు న్యాయవాది V.V.సుబ్బారావు, ప్యానల్ న్యాయవాది M.B.భవాని, K.సుబ్బరాజు, దితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *