సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణానికి చెందిన గతంలో జీ తెలుగు న్యూస్, మహాటీవీ చేనెల్స్ కు జిల్లా రిపోర్టర్ గా సుదీర్ఘ కాలం పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ చలువాది గంగాధర్ ను పలువురు ప్రముఖులు పరామర్శించడం జరిగింది. నేడు, సోమవారం బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి (తపన) పరామర్శించారు. , గత బుధవారం గంగాధర్ తండ్రి చలువాది విజయశ్రీ కాళిదాస్ రాజయోగేంద్ర మరణించడంతో, విషయం తెలుసుకున్న గారపాటి చౌదరి గంగాధర్ నివాసానికి వెళ్లి, కాళిదాస్ చిత్రపటానికి పుష్పమాలవేసి నివాళి అర్పించారు. గంగాధర్ కుటుంబ సభ్యులు ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని, కుటుంబానికి అన్ని విధాలుగా మద్దతుగా నిలుస్తామని గారపాటి చౌదరి అన్నారు. మిత్రులు గంగాధర్ కుటుంబ సబ్యులకు మన సిగ్మా న్యూస్ తరపున ఇప్పటికే స్వయంగా వెళ్లి సంతాపం తెలపడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *