సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎట్టకేలకు ఇజ్రాయిల్ ఫై దాడులు తీవ్ర తరం చేసిన ఇరాన్ ఫై తాజాగా నేడు, ఆదివారం ఉదయం అమెరికా యుద్ధ విమానాలతో దాడి చేసి ఇరాన్ లోని కొండల క్రింద భూ స్వరంగాల క్రింద ఉన్న 3 అణు కేంద్రాల లక్ష్యంగా భారీ క్రషర్ బాంబులతో మ్రోత మోగించింది. దీనిని ఇరాన్ కూడా ధ్రువీకరించింది. అమెరికా యుద్ధం మొదలు పెట్టింది. అయితే దీనిని తామే ముగిస్తామని తీవ్ర హెచ్చరికలు చేసింది. ఇజ్రాయిల్ కీలక సమయం లో ఆదుకున్న అమెరికాకు ఏ దేశం చెయ్యలేని సహాయం చేసారని కృతఙ్ఞతలు చెప్పింది. తదుపరి నేడు, ఆదివారం ఉదయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలు ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లపై అమెరికా సైన్యం దాడులను అద్భుతమైన అమెరికా సైనిక విజయమని చెప్పిన ట్రంప్, ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేయడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఇప్పటికైనా మధ్య ప్రాచ్యంలో గొడవలు సృష్టించే ఇరాన్ ఇప్పుడు శాంతి కోసం అడుగు వేయాలని లేకపోతె భవిష్యత్తులో మరిన్ని దాడులు జరుగుతాయని ట్రంప్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *