సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రస్తుతానికి ముగిసిన నేపథ్యంలో ప్రపంచ మార్కెట్‌లో గత 3 రోజులుగా కొనుగోళ్ల మద్దతు పెరిగింది. ఇక భారతీయ స్టాక్ మార్కెట్ లో కూడా సూచీలు ఫై పైకి లేస్తూనే ఉన్నాయి. తాజాగా నేడు, గురువారం ఉదయం 10 గంటల లోపే సెన్సెక్స్ 250పాయింట్లకు పైగా పెరిగి మళ్లీ 83వేల మార్క్ ను అదుకుంది. అటు నిఫ్టీ 25,300 ఎగువన ట్రేడ్అవుతోంది. సెన్సెక్స్ 253.61 పాయింట్ల లాభంతో 83,009.12 వద్ద, నిఫ్టీ 82.45 పాయింట్ల లాభంతో 25,327.20 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 20పైసలు పెరిగి 85.88గా కొనసాగుతోంది. డాలర్ విలువ బలహీన పడుతుండటంతో అంతర్జాతీయముగా బంగారం ధరలు పెరుగుతున్నాయి.
