సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల సీఎం చంద్రబాబు సమక్షంలో డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ.. ప్రజల హామీలు నెరవేర్చేసాం.. ఎవరైనా తమపై ప్రజలను రెచ్చగొట్టిన, ప్రశ్నించిన వారిని తాట తీస్తాం, మక్కెలు ఇరగగొట్టి మూలాన కూర్చోబెడతాం .అని హెచ్చరిస్తున్నారని, ఏమిటి మీ చేతకాని తనాన్ని ప్రశ్నిస్తే తాట తీస్తారా? మేము ప్రశ్నించక పొతే ప్రజలు ను పట్టించుకొంటారా ? ఇచ్చిన హామీలు మీకు గుర్తుంటాయా? మీ తాటాకు చప్పుళ్లకు, మీ నాలిక మందం మాటలకూ వైసీపీ నేతలు బెదరరని బొత్స ఆగ్రహం వ్యక్తం చేసారు. మేం అడగక పోతే తల్లికి వందం వేసేవారా? అని ప్రశ్నించారు. గత ఏడాదిగా అదిగో ఇదిగో అన్న దాత సుఖీభవ 20,000 ఇస్తాం అన్నారు.. మరి ఏంమైంది? అని ప్రశ్నించారు.. ఇక, సీఎం చంద్రబాబు 100అబద్ధాలు చెబితే, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ 200 అబద్ధాలు చెబుతున్నారని దుయ్య బట్టారు.. గతంలో మా వైసీపీ ఇచ్చిన హామీలు అన్ని అమలు చేసాం. గత ఎన్నికలలో మాకు40 శాతం పైగా ఓటింగ్ వచ్చినా ఏదో జరిగి ఓడిపోయాం .. అది ఈసారి మేం ప్రజల్లో తేల్చుకుంటాం , మీ అక్రమ అరెస్టులకు తాటకుచప్పు లకు భయపడం అని స్ప ష్టం చేశారు.
