సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ప్రాంత వాసి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జన్మదిన వేడుకలు వాడవాడలా ఘనంగా జరుగుతున్నాయి. అటు మొగళ్ళు లోను, భీమవరంలోని ప్రకాశం చౌక్ వద్ద , భీమవరం డి ఎన్ ఆర్ కాలేజీ లోను ఉన్న అల్లూరి కాంస్యవిగ్రహాలకు ప్రముఖులు నివాళ్లు అర్పించి కార్యక్రమాలు నిర్వహించారు. అల్లూరి .. స్ఫూర్తిదాయక జీవితం అందరికి ఆదర్శమని, వారి త్యాగాలను తప్పక స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పలువురు ప్రముఖులు అన్నారు.నేడు, శుక్రవారం భీమవరం అల్లూరి స్మృతి వనంలోని 30 అడుగుల కాంస్య విగ్రహం వద్ద అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం వద్ద మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి మహోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఎమ్మెల్యే అంజిబాబు ,జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు పాల్గొని అల్లూరికి నివాళిలర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *