సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో శ్రీ శ్రీనివాసుడిని కేంద్రమంత్రి బండి సంజయ్ నేడు, శుక్రవారం దర్శించుకొన్నారు. టీటీడీ లో 1000 మంది పైగా అన్య మతస్తులు పని చేస్తూ, జీతాలు తీసుకొంటున్నారని ఇప్పటికి వారిని టీటీడీ బోర్డు ఎందుకు తొలగించడం లేదని? వారికీ తిరుమల ఏమైనా ధర్మ సత్రమా? అని ఘాటుగా టీటీడీ బోర్డు ను ప్రశ్నించారు. మొన్న రెండు రోజుల క్రిత్తం ఓ ఉద్యోగి అన్యమతాన్ని పాటిస్తున్నాడంటేనే తొలగిస్తారా ?అని ప్రశ్నించారు. టీటీడీలోని మొత్తం అన్యమత ఉద్యోగస్థులందరినీ గుర్తించి వెంటనే తొలగించాలని పట్టుబట్టారు. ఎందుకు ఈ ఉదాసీనత అర్ధం కావడంలేదు.. చర్చి మసీదులలో హిందువులకు ఉద్యోగాలు ఇస్తారా? అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలతో పాటు పురాతన ఆలయాలను టీటీడీ అభివృద్ధి చేయాలని కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఇల్లెందు రామాలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి, వేములవాడ ఆలయాల అభివృద్ధికి టీటీడీ సహకారం అందించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కోరారు.
