సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాకినాడ లోని రంగరాయ వైద్య కళాశాలలో (Rangaraya Medical College) విద్యార్థినుల ఫై కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులని ల్యాబ్ టెక్నీషియన్ లైంగిక వేధింపులకి గురిచేశాడు. బీఎస్సీ, ల్యాబ్ టెక్నాలజీ కోర్సుల విద్యార్థినులపై ల్యాబ్ ఆస్తిస్టెంట్ మరియు, మరో ఉద్యోగి సహకారంతో వికృత చేష్టలకి పాల్పడ్డాడు. విద్యార్థినుల శరీరాన్ని అసభ్యకరంగా తాకడం, వంటి జుగుప్సాకరమైన చేష్టలు చేస్తూ, అసభ్యకరమైన ఫొటోలు తీసి పలువురి వాట్సాప్‌లకు పంపించేవాడని.. విద్యార్థులను మార్కులు కావాలంటే రూమ్‌కి రమ్మని బెదిరించేవాడని, డబ్బులు ఎరవేసేవాడని బాధిత విద్యార్థినులు కళాశాల ప్రిన్సిపల్ డా.విష్ణువర్ధన్‌కి ఫిర్యాదు చేశారు. ఈ నెల(జులై) 8వ తేదీన విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో లోకల్ బాడీ కమిటీతో కళాశాల ప్రిన్సిపల్ విచారణ జరిపించారు. బయో కెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, మైక్రో బయాలజీ టెక్నీషియన్ జిమ్మీ రాజు, బయో కెమిస్ట్రీ ఎల్ టీ గోపాలకృష్ణ, పాదాలజీ ఎల్టీ ప్రసాద్ తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని 50 మంది విద్యార్థినులు విచారణ కమిటీ ముందు పిర్యాదు చేసారు. విచారణ నివేదిక రాగానే చర్యలు చేపడతామని ప్రిన్సిపల్ డా.విష్ణువర్ధన్ తెలిపారు. కొందరు తల్లి తండ్రులు ఆందోళనతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నేడు, శుక్రవారం సీరియస్ అయ్యారు. నిందితులపై తక్షణం చర్యలు తీసుకోని కళాశాలలో విద్యార్థినులకు భద్రతా కాపాడాలని ఆదేశాలు జారీ చేసారు.
