సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ కీలక నేత, ఏ విషయం అయిన ఆచితూచి ఉద్రేకపడకుండా తనదైన శైలి లో ఎదురుదాడి చేసే మాజీ మంత్రి పేర్ని నాని తాజగా వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేసారు. అధికారంలో ఉన్నాం కదాని, టీడీపీ నేతలు మంత్రి లోకేష్ తరచూ రెడ్ బుక్.. అంటూ వైసీపీ వారిని అక్రమ కేసులు పెట్టిస్తూ హింసిస్తుంటే.. మంత్రి నారా లోకేష్ లాగా మీరు చెడిపోయారా? ఇంకా వైసీపీ కార్యకర్తలు ఎన్నిసార్లు రప్పా రప్పా అని అంటారని ఫైరయ్యారు.’చేసేవాడు చెప్పడు .. చెప్పేవాడు చెయ్యడు’ చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి.. నరికేస్తాం అని అరవటం కాదు.. చీకట్లో మొత్తం అయిపోవాలి.. ఆ తరువాత వెళ్లి ఎలా జరిగింది, ఏంటి? అని పరామర్శించా లన్నారు. మనపై దౌర్జనం చేసినవారిని చెప్పి నరకడం కాదు, చెప్పకుండా నరికెయ్యాలని కార్యకర్తలను మరింత రెచ్చగొడుతూ ప్రసంగించారు. కృష్ణాజిల్లా పామర్రు, అవనిగడ్డలలో గురు, శుక్రవారాల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మాటలపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
