సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలో పేదవారికి అభయ హస్తం సీఎం సహాయ నిధి క్రింద 12 మంది లబ్ధిదారులకు రూ 6 లక్షలను ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు నేడు, శనివారం అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భీమవరం నియోజకవర్గంలోని 12మంది లబ్ధిదారులకు రూ 6,03,958 చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు వారికి అందించారు. సీఎం సహాయ నిధి వైద్య పరంగా ఎంతో ఉపయోగపడుతుందని, ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని, పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగానే సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది కాలంలో భీమవరం నియోజక వర్గంలో 222 మందికి రూ 2, 06,07,905 లను అందించామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు పాల్గొన్నారు.
