సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల తెలుగు రాష్ట్రాలలో మీడియా కార్యాలయాలు ఫై దాడులు పెరిగిపోతున్నాయి. మొన్నఏపీలో సాక్షి కార్యాలయాలు నిన్న తెలంగాణాలో మహా టివి కార్యాలయం నేడు, ఆదివారం మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకి సంబంధించిన (MLC Teenmar Mallanna) క్యూ న్యూస్ కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఇటీవల మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేశారు. మల్లన్న కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేశారు. తీన్మార్ మల్లన్న గన్‌మెన్ హెచ్చరించినా కార్యాలయం నుంచి జాగృతి సభ్యులు వెళ్లకపోవడంతో గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపాడు. అయినా దూసుకొని వస్తున్నా వారిపై కాల్పులు జరపడంతో ఈ కాల్పుల్లో జాగృతి సభ్యుడు సాయి అనే యువకుడికి గాయాలయ్యాయి. వెంటనే యువకుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సాయికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆయన చేతి నుంచి బులెట్ వెళ్లినట్లు వైద్యులు గుర్తించారు. అయితే తీన్మార్ మల్లన్న కార్యాలయంలో ఎక్కువగా రక్తం మరకలు కనిపించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *