సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల అమెరికా దూకుడు కు అడ్డుకట్ట వెయ్యడానికి రష్యా అడ్జక్షుడు పుతిన్ ప్రపంచ అజేయ శక్తిగా lRC కూటమి( రష్యా చైనా ఇండియా త్రిదేశ కూటమి) ఏర్పాటు చెయ్యాలని దీనితో ప్రపంచ జనాభాలో సగభాగం,ఆర్ధిక అభివృద్ధిలో బలంగా ఉన్న ఉన్న 3 ప్రధాన ఆసియా దేశాలు అమెరికా నేతృత్వంలోని నాటో దేశాల అజమాయిషీని అడ్డుకట్ట వెయ్యాలని కుటిల చైనా తో భారత్ సమస్యలు పరిష్కారం అయితే ఇది సాధ్యం అవుతుందని భావించి దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. మరో ప్రక్క ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) త్వరలో చైనా (China)లో పర్యటించనున్నట్టు? తెలుస్తోంది. తియాంజిన్ వేదికగా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు ఆగస్టు 31-సెప్టెంబర్ 1 తేదీల్లో జరుగనుంది. అక్కడికి రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్, ఎస్సీఏ సభ్య దేశాల నేతలు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు. 2020లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో సైనికుల మధ్య ఘర్షణతో చైనా-భారత్ మధ్య దౌత్య సంబంధాలు స్తంభించిన అనంతరం చైనాలో మోదీ పర్యటించనుండటం ఇదే ప్రథమం. చైనా పర్యటనలో భాగంగా దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌తో , రష్యా అడ్జక్షుడు పుతిన్ తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. మోదీ పర్యటనకు ముందుగా చైనాలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల పర్యటించారు. ఎస్సీఓ సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సదస్సులో పహల్గాం ఉగ్రదాడిని సైతం ప్రస్తావించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తోనూ భేటీ అయ్యారు. గత ఐదేళ్లలో చైనాలో మొదటిసారిగా ఆయన పర్యటించడం పాకిస్తాన్ కు చైనా మద్దతు ఇవ్వడం వల్ల భారత్ కు దూరం పెరుగుతున్న విషయం చైనా దృష్టికి తేవడం జరిగింది. మొత్తానికి ఎదో జరుగుతుంది.
