సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో ఆధ్యాత్మిక ప్రవచనాలపై ససంగమ్ ఫై ఆసక్తి కలవారికి ముఖ్య గమనిక.. రేపటి శుక్రవారం నుండి వచ్చే ఆగస్టు నెల 14వ తేదీవరకు స్థానిక ఉండి రోడ్డులో జంట కాలువల వద్ద ఇటీవల నూతనంగా నిర్మించిన శ్రీ కాళీ వన ఆశ్రమ శాఖ భవనం లో ఆశ్రమ స్థిర నివాసులు ‘శ్రీనివాస రామానుజ దాసు’ వారిచే ప్రతి రోజు సాయంత్రం 6 గంటల నుండి శ్రీ మద్భాగవతం..శ్రీ కృష్ణ లీలామృతం ఫై సత్సంగ సమావేశం ‘శ్రీ గురుదేవుల’ అనుగ్రహంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆధ్యాత్మిక చింతన గలిగిన అందరు తప్పనిసరిగా సకుటుంబంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
