సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ శత్రుదేశం పాకిస్తాన్ ఫై ఆపరేషన్ సిందూర్ తో చేసిన భారీ దాడుల నేపథ్యంలో సందిట్లో సడేమియా అంటూ పాకిస్తాన్ లోని 45 శాతం భూభాగంలో బెలూచిస్తాన్ రాష్ట్రము స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న విషయం ప్రపంచానికి తెలిసిందే.. తమ దేశాన్ని గుర్తించాలని భారత్ ను వారు అభ్యర్థిస్తున్నారు. బెలూచిస్తాన్ ను తిరిగి స్వాధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తున్న పాకిస్తాన్ సైన్యానికి బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఊహించని ఎదురు దాడులతో చుక్కలు చూపిస్తుంది. ఆసంస్థ ఓ సోషల్ మీడియా పోస్టులోతాజా ప్రకటన ద్వారా.. బీఎల్ఏకు చెందిన ఫతే స్క్వాడ్ కలాత్లోని నిమ్రాగ్ క్రాస్ వద్ద కరాచీ నుంచి పాకిస్తాన్ సైనికులను తరలిస్తున్న ఓ బస్సును లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. ఇందులో 27 మంది సైనికులు చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఘటనలో క్వెట్టాలోని హజార్గం జ్లో ఐఈడీ పేల్చి మరో ఇద్దరు సైనికులను హతమార్చినట్లు బీఎల్ఏ ప్రకటించింది. మంగళవారం కలాత్లోని ఖజినా ప్రాంతంలో మరో ఐఈడీ పేల్చి నలుగురు సైనికులను , బుధవారం గుజ్రోకొర్ ఏరియాలో దాడి చేసి మరో ఆరుగురుసైనికులను హత్య చేసినట్లు బీఎల్ఏ ప్రకటించింది. ఈ ఏడాది బెలూచి ఆర్మీ జరిపిన 286 దాడులలో పాకిస్తాన్ సైన్యం 700 మంది పైగా మరణించారని అనేక మంది గాయపడ్డారని, 290 బందీలుగా బెలూచి ఆర్మీకి చిక్కారని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *