సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అతి త్వరలో ప్రధాని మోడీ చైనా పర్యటన ఖరారు అవుతుందని, అక్కడ రష్యా అడ్జక్షుడు పుతిన్ కూడా వచ్చి ముగ్గురు అగ్ర నేతలు భారత్తో కలిసి రష్యా, చైనాలు కూటమి (RIC) ఏర్పాటు దిశగా చర్చలు జరుపుతారని వసున్న వార్తల నేపథ్యంలో ఈ తాజా పరిణామాలు ఏమాత్రం రుచించని అమెరికా దాని మిత్ర నాటో దేశాలు భారత్ ఫై మరిన్ని సుంకాలు పెంచుతామని హడావిడి చేస్తూన్న నేపథ్యంలో ఆర్ఐసీ కూటమి ప్రయత్నాలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు తాజాగా ఆచితూచి స్పందించాయి. ఈ దిశగా తాము ఎలాంటి మీటింగ్కు ఇంకా అంగీకరించలేదని స్పష్టం చేశాయి. ‘రష్యా-ఇండియా-చైనా కూటమి ఫార్మాట్లో ఎలాంటి మీటింగ్కు “ప్రస్తుతానికి” అయితే మేము అంగీకరించలేదు. అలాంటి సమావేశాలు జరిగినప్పుడు అందరికీ ఆమోదయోగ్యమైన తేదీపై ముందు చర్చలు జరుగుతాయి. అలాంటిదేమైనా ఉంటే మీడియాకు చెబుతాము’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.అయితే రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ.. పాశ్చాత్య ప్రాబల్యానికి సరితూగే శక్తిగా రష్యా, చైనా, ఇండియా కూటమిగా ఏర్పడాలన్న భావన ఎప్పటి నుంచో ఉన్నదే. ఇప్పటికే మినిస్టీరియల్ లెవెల్లో 20కి పైగా మీటింగ్స్ జరిగాయి’అన్నారు.ఈ చర్చలను పునఃప్రారంభించేందుకు రష్యా డిప్యుటీ విదేశాంగ శాఖ మంత్రి ఆండ్రే రుడెంకో ప్రయత్నిస్తున్నట్టు అక్కడి మీడియా పేర్కొంది. ఇక రష్యా ప్రయత్నాలపై చైనా కూడా సానుకూలంగా స్పందించింది. నిద్రాణంగా ఉన్న ఈ కూటమిని మేలుకొల్పితే మూడు దేశాలకు ప్రయోజనకారకమని అభిప్రాయపడింది. ప్రపంచదేశాల భద్రతకు ఇది అవసరమని కూడా పేర్కొంది.
