సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ తన రక్షణ అవసరాలకు మరింత అధునాత స్వదేశీ… స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు పృథ్వీ 2, అగ్ని 1ల పరీక్ష విజయవంతం అయింది అని తాజగా ప్రకటించారు. వీటిని భారతదేశ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసింది. గత గురువారం ఒడిశా, చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి వీటిని పరీక్షించారు. ది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (SFC) ఆధ్వర్యంలో వీటి పరీక్ష జరిగింది. పృథ్వీ 2, అగ్ని 1లు ఆపరేషనల్, టెక్నికల్ పారామీటర్స్‌ను అందుకున్నాయి. దీంతో పరీక్ష విజయవంతం అయింది. పృథ్వీ 2 ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి. ఈ క్షిపణి రేంజ్ 350 కిలోమీటర్లు. 500 నుంచి 1000 కిలోల బరువును మోసుకెళ్లగలదు. ఇక అగ్ని 1 మిస్సైల్ ఈ క్షిపణి రేంజ్ 700 నుంచి 900 కిలోమీటర్లు. ఇది వెయ్యి కిలోల యుద్ధ సామాగ్రిని మోసుకెళ్లగలదు. తక్కువ లోడు ఉంటే ఏకంగా 1200 కిలోమీటర్లు దూసుకెళ్లగలదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *