సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుండి గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపిస్తూ 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో మధ్యం ధరలను అనూహ్యంగా పెంచి, తద్వారా డిస్టలరీల నుంచి ముడుపులు, కిక్ బ్యాగ్స్ సేకరించినట్టు భావిస్తు కూటమి ప్రభుత్వ ఆదేశాలతో సిట్ దర్యాప్తు చేస్తుంది. ఆ కేసులో కేసి రెడ్డి, విజయ సాయి రెడ్డి మొదలు పలువురు వైసీపీ పెద్దలను విచారిస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు నిన్న విజయవాడలో 6 గంటల పాటు విచారించిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ని నిందితుడు గ భావిస్తూ గత రాత్రి అరెస్ట్ చేసిన నేపథ్యంలో తాజాగా ఆయనకు కోర్టు ఆగష్టు1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఏ4గా ఉన్నారు. ఆగస్టు 1 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో అతడ్ని నేడు, ఆదివారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఇప్పటికి లిక్కర్ స్కాము చార్జిషీట్ లో 40మంది ఉండగా తాజాగా మరో 8మందిని నిందితులుగా పేర్కొన్నారు. జగన్‌కు తెలిసే లిక్కర్ స్కాం జరిగిందని సిట్ అధికారులు అంటున్నారు. అయితే మాజీ సీఎం జగన్ ను నిందితుడుగా ఎక్కడ పేర్కొనకపోవడం గమనార్హం..
