సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి నేడు ఆదివారం.. మహిళా భక్తులు శ్రీ అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తూ .. శ్రీ అమ్మవారిని దర్శించుకున్న పలువురు భక్తులు సుమారు 1000 కేజీల రకరకాల మిఠాయిలతో సారేను అమ్మవారికి అందించారని ఆలయ సహాయ కమీషనర్ శ్రీ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. పట్టణానికి చెందిన క్వీన్స్ కిట్టి మహిళలు 51 రకాలతో 250 కేజీల సారే, విజయవాడ,ఆకివీడు, వీరవాసరం, భీమవరంకు చెందిన పలువురు భక్తులు విరివిరిగా 200, 108 కేజీల చొప్పున అమ్మవారికి సారే అందించారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించి సారే అందించిన భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం భక్తులకు అమ్మవారికి పూజ చేసిన ధ్యానం, పసుపు కుంకుమ లను అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *