సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి సోమవారం ఉదయం నుండి ఢిల్లీలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశాలున్నాయి. ప్రధాని మోడీ ఇటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు ఎంపీలు హాజరు అయ్యారు. ఈ సమావేశాలలో మొత్తం 12 కీలక బిల్లులకు ఆమోద ముద్ర సాధించాలని కేంద్రం భావిస్తోంది. వీటిలో కొన్ని ఇప్పటికే పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్నవి కాగా, 8 బిల్లులు కొత్తగా ప్రవేశపెట్టనున్నట్లు లోక్‌సభ వర్గాలు తెలిపాయి. ఎన్నికలలో ఈవీఎం మిషన్ల టాంపరింగ్, రిగ్గింగ్ ఫిర్యాదులపై ప్రతి ప్రక్షాలు ఎన్డీయే ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈసారి పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి.
