సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవన్ కళ్యాణ్ హీరోగా ‘హరిహర వీరమల్లు’. తొలుత క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మిగతా సగభాగాన్ని ఎ.ఎం.జ్యోతికృష్ణ తెరకెక్కించారు.ఈ నెల 24న పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘నేను యాక్సిడెంటల్‌గా యాక్టర్‌నయ్యా. సినిమాలో నటించడం తప్ప సినిమాను ఎలా ప్రమోట్‌ చేయాలో నాకు తెలీదు. మీడియాతో మాట్లాడటానికి పొగరు, అహంకారం కాదు. సినిమా గురించి ఎక్కువ మాట్లాడకూడదు అనిపిస్తుంది. ఎ.ఎం.రత్నంగారి కోసం మీడియా ముందుకొచ్చా. సినిమా బతకాలి.. ఆయన కష్టానికి ఫలితం దక్కాలి అని ఈ ప్రెస్‌మీట్‌ నిర్వహిస్తున్నాం. ఏ ఎం రత్నం గారితో ‘ఖుషి’ చేసే అవకాశం నాకు దక్కింది. అప్పుడు ఆయన నాకు ఇచ్చిన ఫ్రీడమ్‌ ఇప్పటికీ మరువలేను. ఆయన నిర్మాణ సంస్థలో సినిమా చేయాలని క్యూ కట్టిన దర్శకుడు, హీరోలను చూశా. కానీ ఈ రోజున ఆయన నలిగిపోతుంటే నాకు చాలా బాధ కలిగింది. అది క్రియేటివ్‌గా కావచ్చు.. ఆర్దికంగా కావచ్చు. అలాంటిది అన్ని రత్నం గారు ఈ సినిమాకు ఎన్నో చూశారు. అవన్నీ చూసే ఎలాగైనా ఈ సినిమా పూర్తి చేయాలని,. ప్రత్యర్థులు తిడుతున్నాసినిమా పూర్తీ చేశాను. కొన్ని వ్యక్తిగత కారణాలు, ప్రొఫెషనల్‌ ఇష్యూతో క్రిష్‌గారు పక్కకు జరిగిన ఆయన తీసుకొచ్చిన కంటెంట్‌ మాత్రం చాలా బలమైనది, విలువైనది.ముండుటెండల్లో నా దగ్గర లేని టైమ్‌ను సర్దుకుని ఈ సినిమా క్లైమాక్స్‌ కోసం 56 రోజులు సమయం కేటాయించాను.హరిహర వీరమల్లు బాగా వచ్చింది. దీని రిజల్ట్‌ ప్రజల చేతిలో ఉంది. దాని గురించి నేను ఎప్పుడూ ఆలోచించను. అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *