సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; ఎట్టకేలకు పశ్చిమ గోదావరి జిల్లాను వరుణుఁడు కరుణించాడు. గత రాత్రి నుండి నేటి సోమవారం సాయంత్రం వరకు వర్షాలు పడుతూనే ఉన్నాయి. వాతావరణం చల్లబడింది. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో.. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దాని ప్రభావంతో వర్షాలు పడుతున్నాయ్. సుమారు 20 రోజుల తరువాత ప్రజలు ఎండలు, ఉక్కపోత నుండి ఉపశమనం పొందుతున్నారు. ఇక ఎల్లుండి బుధవారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీంతో రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
