సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; దేశీయ స్టాక్ మార్కెట్ లో గత రెండు సెషన్లలో నష్టాలను చవి చూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని నేడు, సోమవారం మొదటి రోజు లాభాలతో ప్రారంభించాయి. బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపించాయి. ఉదయం కాసేపు నష్టాల్లో కదలాడిన సూచీలు ఆ తర్వాత లాభాల పట్టాయి. గత శుక్రవారం ముగింపు (81, 757)తో పోల్చుకుంటే నేడు సోమవారం ఉదయం లాభాలతో మొదలైన సెన్సెక్స్ కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఆ తర్వాత లాభాల్లోకి ప్రవేశించి రోజంతా లాభాల్లోనే కదలాడింది. మధ్యాహ్నం తర్వాత ఆ లాభాలు మరింత పెరిగాయి. చివరకు సెన్సెక్స్ 442 పాయింట్ల లాభంతో 82, 200 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే నడించింది. చివరకు 122 పాయింట్ల లాభంతో 25, 090 వద్ద రోజును ముగించింది. కాగా, రికార్డు స్థాయి లాభాలను ప్రకటించిన రిలయెన్స్ కంపెనీ ఈ రోజు నష్టాలను మూటగట్టుకోవడం గమనార్హం. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 363 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 669 పాయింట్లు ఆర్జించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.29గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *