సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) CHSL, CGL, MTS, CPO మొదలైన రాబోయే నియామక పరీక్షల కోసం తాజగా కొత్త మార్గదర్శకాలను ప్రకటించారు. ఆ క్రమంలో అభ్యర్థులు ఏదైనా నియమాన్ని ఉల్లంఘించడం వల్ల అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడమే కాకుండా చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చని కమిషన్ స్పష్టం చేసింది. రాబోయే పరీక్షల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది (SSC 2025 New Rules). వీటి ప్రకారం అభ్యర్థుల ప్రత్యక్ష ఫోటోగ్రఫీ, కఠినమైన భద్రతా తనిఖీలు, పరీక్ష సమయంలో చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు తప్పనిసరి వంటి కఠినమైన ఏర్పాట్లు అమల్లోకి తెచ్చారు.ఇప్పుడు లైవ్ ఫోటోగ్రఫీ అమలు చేయనున్నారు. ఆ క్రమంలో పరీక్ష హాలులోకి ప్రవేశించే సమయంలో, పరీక్ష సమయం, ముగింపు టైంలో కూడా అభ్యర్థుల ఫోటో తీయబడుతుంది. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, గేట్ మూసివేసిన తర్వాత ఎవరినీ లోపలికి అనుమతించబోమని ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *