సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వరుసగా 3 సార్లు వైసీపీ ఎంపీ గా కొనసాగుతూ.. ప్యానెల్ స్పీకర్ గా పలుసార్లు లోక్ సభను నిర్వహించిన రాజంపేట ఎంపీ మిదున్ రెడ్డి ఇటీవల ఏపీ లిక్కర్ స్కాం ఆరోపణలపై కేసులో అరెస్ట్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్నారు. దీనిని చంద్రబాబు ప్రభుత్వం చేసిన కక్ష పూరిత చర్యగా మాజీ సీఎం జగన్ విమర్శించారు. అయితే ఎంపీ మిథున్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఏసీబీ కోర్ట్ లో నేడు, కొంత ఊరట లభించింది. ఇంకా కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో ఆయనకు లోక్ సభ సభ్యునిగా .. జైలులో టీవీ, బెడ్, వెస్ట్రన్ కమోడ్ రూం, మూడు పుటలు బయట నుంచి లేదా ఇంటి వద్ద నుండి భోజనం, మంచం, దోమ తెర, యోగ మ్యాట్, వాకింగ్ షూస్, వార్త పత్రికలు ఇవ్వాలని ఏసీబీ కోర్ట్ ఆదేశించింది. ఒక పర్యవేక్షకుడు, ఇద్దరు లాయర్లతో ప్రైవసీతో కూడిన సమావేశాలు వారానికి ఐదు రోజులు నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. ఇంకా రెగ్యులర్ మెడిసిన్, నోట్ బుక్స్, పెన్ లు సమకూర్చాలని జైలు అధికారులను ఆదేశించింది.
