సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో నేడు, శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం లోని ఖైతాపురం వద్ద హైవేపై కారు ఓ లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న నలుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన వారిని .ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్న డీఎస్పీలు (DSPs) మేక చక్రధర్ రావు (Meka Chakradhar Rao), శాంతారావు (Shantharao) గా గుర్తించారు. ఏపీ నుంచి ఒక ముఖ్యమైన పనిపై హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకొంది అని పోలీసులు పేర్కొన్నారు. ఇంకా పూర్తీ సమాచారం అందవలసి ఉంది.
