సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో వాడవాడలా ప్రతివార్డులో శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను నిర్వహించడం ఎంతో శుభ పరిణామమని స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. నేడు, ఆదివారం భీమవరంలోని 10,23,24, 37,38వ వార్డులో పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీమావుళ్ళమ్మ అమ్మవార్లఅమ్మవారి జాతర మహోత్సవాలను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. స్థానిక యువత వారి వారి వార్డులలో సాంప్రదాయంగా అమ్మవారి జాతర వేడుకలను నిర్వహించడం అభినందనీయమని, ప్రతిఒక్కరీలో దైవభక్తి ఆధ్యాత్మిక చింతన ఉండాలని అన్నారు. అనంతరం శక్తి వేషాధారణలు, డప్పుల వాయిద్యాలతో గరగల నృత్యాలతో ప్రత్యేకంగా అలంకరణ చేసిన వాహనంపై అమ్మవారిని ఊరేగించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, జాతర కమిటీ సభ్యులు, కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *