సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత వారం నష్టాలు పాలు చేసిన దేశి స్టాక్ మార్కెట్ ఇంకా నేటి సోమవారం కూడా అదే బాటలో భారీ నష్టాలలో కొనసాగింది. విదేశాలలో అంతర్జాతీయ మార్కెట్ల నష్టాలు మన దేశీయ సూచీలపై తీవ్ర ప్రభావం చూపించాయి. మరో ప్రక్క అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ ఆలస్యం అవుతుండడం కూడా దేశి మార్కెట్ నష్టాలకు పరోక్షంగా కారణం అవుతుంది. గత శుక్రవారం ముగింపు (81, 463)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం నష్టాలతో మొదలైన సెన్సెక్స్ ఉదయం కాసేపు లాభనష్టాలతో దోబూచులాడింది. అయితే మధ్యాహ్నం తర్వాత మదుపర్లు అమ్మకాలకు దిగడంతో సెన్సెక్స్ కోలుకోలేదు. చివరకు సెన్సెక్స్ 572 పాయింట్ల నష్టంతో 80, 891 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే నడించింది. చివరకు 156 పాయింట్ల నష్టంతో 24, 680 వద్ద రోజును ముగించింది. అయితే సెన్సెక్స్‌లో లారస్ ల్యాబ్స్, ఎంపసిస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, శ్రీరామ్ ఫైనాన్స్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు లాభాలు ఆర్జించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 490 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ 444 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.67గా ఉంది.
