సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, సోమవారం దర్శించుకున్న స్థానిక భక్తులు నల్లమల్ల వెంకట సుబ్బారావు సుబ్బలక్ష్మి దంపతులు దేవాలయంలో నిత్యం జరిగే శ్రీ అమ్మవారి నిత్యాన్నదాన ప్రసాదం పధకానికి కి 50,000 (ఏబై వేలు )రూపాయలు మరియు శ్రీ అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయం కొరకు సుమారు.. ఏబై నాలుగు వేలు రూపాయలు విలువైన 6 గ్రాముల బంగారం కానుక గా సమర్పించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు నిర్వహించి ప్రసాదాలు అందచేసినారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
