సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సూర్యగ్రహణం రెండు సంవత్సరాల తరువాత,వచ్చే ఆగస్టు 2, 2027న వస్తుంది. 100 సంవత్సరాల తర్వాత వచ్చే అత్యంత అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే. ఎందుకంటే ఆ రోజున చంద్రుడు సూర్యుడిని దాదాపు 6 నిమిషాల 23 సెకన్ల పాటు పూర్తిగా కప్పేస్తాడు. దీని కారణంగా కొన్ని ప్రదేశాలలో పట్టపగలే చీకటి ఆవరిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, సూర్యగ్రహణం ఎల్లప్పుడూ అమావాస్య రోజున సంభవిస్తుంది, ఎందుకంటే అప్పుడే చంద్రుడు, సూర్యుడు ఒకే కక్ష్యలోకి వస్తాయి. అయితే శాస్త్రవేతలు సూర్య గ్రహణంగా దీనిని నిర్ధారించడం లేదు. ఆగస్టు 2, 2025 న అమావాస్య లేదు. కాబట్టి ఆ రోజున సూర్యగ్రహణం భారత్ లో ఏర్పడటం సాధ్యం కాదు.ఈ గ్రహణం ప్రధానంగా యూరప్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల్లో స్పష్టంగా కనిపించనుంది. మొరాకో, ఈజిప్ట్, సౌదీ అరేబియా వంటి దేశాల్లోనూ మధ్యాహ్న సమయంలోనే సూర్యుడు పూర్తిగా కప్పివేయబడే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆ ప్రాంతాలు పూర్తి చీకటిలో మునిగిపోవచ్చని ఖగోళ నిపుణులు అంచనా వేస్తున్నారు.అయితే ఈ గ్రహణం భారతదేశంలో సంపూర్ణంగా కనిపించదు. అయితే, ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా వంటి నగరాల్లో పాక్షిక సూర్యగ్రహణం నమోదు కానుంది. భారత్‌లో సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో గ్రహణం ప్రారంభమై సూర్యాస్తమయం వరకు కొనసాగుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *