సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రాబోయే దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, భీమవరం నరసాపురం ప్రాంత ప్రయాణ సౌకర్యార్థం తన విజ్ఞప్తి మేరకు నరసాపురం నుండి చర్లపల్లి మరియు ‘తిరువణ్ణామలై’ స్టేషన్ల మధ్య పూజా ప్రత్యేక రైళ్లను (TOD Special) నడపనున్నట్లు కేంద్రమంత్రి, శ్రీనివాస వర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రెండు మార్గాల్లో మొత్తం 36 ట్రిప్పుల పాటు ఈ ప్రత్యేక రైళ్లు మొత్తం 23 బోగీలుతో ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి అని ఆయన పేర్కొన్నారు. రెండు ప్రత్యేక రైలు వివరాలు: నరసాపూర్ – చర్లపల్లి మార్గంలో రైలు నంబర్ 07062 ప్రత్యేక రైలు అక్టోబర్ నెలలో 4, 11, 18, 25 తేదీలలో, అలాగే నవంబర్ నెలలో 1, 8, 15, 22, 29 తేదీలలో (మొత్తం 9 ట్రిప్పులు) నడుస్తుంది. ఈ రైలు రాత్రి 10:00 (22:00) గంటలకు నరసాపూర్ లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08:30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07063 చర్లపల్లి – నరసాపూర్ ప్రత్యేక రైలు అక్టోబర్ నెలలో 5, 12, 19, 26 తేదీలలో మరియు నవంబర్ నెలలో 2, 9, 16, 23, 30 తేదీలలో ప్రయాణిస్తుంది. ఈ రైలు సాయంత్రం 07:50 (19:50) గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07:00 గంటలకు నరసాపూర్ చేరుకుంటుంది. ఈ రైళ్లు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ మరియు నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి. అదేవిధంగా నరసాపురం నుండి తిరువణ్ణామలై వెళ్లే ప్రత్యేక రైలు (నం. 07291) అక్టోబర్ 4 నుంచి నవంబర్ 29 వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది. ఈ రైలు నరసాపురంలో మధ్యాహ్నం 1:00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:55 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరువణ్ణామలై నుండి నరసాపురం వచ్చే ప్రత్యేక రైలు (నం. 07292) అక్టోబర్ 5 నుంచి నవంబర్ 30 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తిరువణ్ణామలైలో రాత్రి 8:00 (20:00) గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10:45 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. ఈ రైళ్లు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ జంక్షన్, విజయవాడ జంక్షన్, తెనాలి జంక్షన్, తిరుపతి, చిత్తూరు, వెల్లూర్ కంటోన్మెంట్ స్టేషన్లలో ఆగుతాయి.( up file photo)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *