సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి మంగళవారం ఉదయం భీమవరం పట్టణం సమీపంలోని ఉండి నియోజకవర్గం పరిధిలోని కోపల్లె గ్రామం వద్ద స్టేట్ హైవేపై ఎన్నో దశాబ్దాలుగా శిథిలావస్థలో ఉన్న బ్రిటిష్ కాలం నాటి పాత వంతెన స్థానంలో చేపట్టిన కోపల్లె 4 లేన్ల నూతన వంతెన నిర్మాణంలో భాగంగా నిర్మించిన రెండవ వంతెనను శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ప్రారంభించారు. దీనితో వాహనాల రాకపోకలు కు మరింత సౌకర్యవంతంగా రోడ్డు అమరింది. ఇటీవల మొదట నిర్మించిన 2 లేన్ల నూతన వంతెనను జిల్లా కలెక్టర్ సి. నాగరాణి తో కలిసి రఘురామా ప్రారంభించడం గమనార్హం., త్వరలోనే కోపల్లె గ్రామంలో ప్రముఖ వైద్య శాస్త్రవేత్త, బయోకెమిస్ట్, దివంగత డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు మీద ప్రస్తుతం నిర్మాణం లో ఉన్న పార్కుతో పాటు, 4 లేన్ల వంతెనకు అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం మరి కొద్దీ రోజులలో నిర్వహిస్తామని రఘురామకృష్ణ రాజు ఈ సందర్భముగా ప్రకటించారు.
