సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మునిసిపల్ కమిషనర్, రామచంద్ర రెడ్డి నేడు, బుధవారం తాజగా తెలియజేసిన సమాచారం ప్రకారం.. భీమవరం పట్టణ పరిధిలో అనధికార లేఅవుట్లు మరియు ప్లాట్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు G.O.Ms.No.134, MA&UD(M) శాఖ, తేది.26.07.2025 ద్వారా అనధికార లేఅవుట్లు మరియు ప్లాట్ల క్రమబద్ధీకరణ నిబంధనలు (LRS-2020) ప్రకారం గడువును 30-06-2025 వరకు పొడిగించుట జరిగినది. కావున, భీమవరం పట్టణ ప్రజలు ది. 30-06-2025 తేదీకి ముందు అనధికార లేఔట్ లో ఫ్లాట్లు, స్థలాలు కొనుగోలు చేసి ఉంటే ది.26-07-2025 వ తేదీ నుంచి 90 రోజుల గడువులోగా ఎల్ఆర్ఎస్ (https://lrsdtcp.ap.gov.in) వైబ్ సైట్ నందు నమోదు చేసుకోవలెను.
