సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రౌడీ హీరోగా అభిమానులు పిలుచుకునే అందగాడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) చాల కాలంగా సరైన హిట్ సినిమా కోసం చాల ఆకలిగా ఎదురుచూస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ లో తెరకెక్కించిన ‘కింగ్ డమ్’ సినిమాతో భారీ అంచనాలతో నేడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కధ విషయానికి వస్తే.. 1920 నాటి కాలం. బ్రిటీషర్స్ భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలం. శ్రీకాకుళం ప్రాంతంలో బంగారు గనులపై కన్నేసిన తెల్లదొరలు అక్కడి ఓ జాతిని అంతం చేసి బంగారు గనులను కొల్లగొట్టాలని చూస్తారు. అక్కడి ఓ యోధుడు తన జాతికి అండగా నిలిచి, కొందరిని ఓ ఓడలో సముద్రంపైకి పంపి తన ప్రాణం కోల్పోతాడు. అలా బయలుదేరిన ఆ గూడెం జనం శ్రీలంక తీర ప్రాంతమైన జాఫ్నా చేరి అక్కడ స్థిరపడతారు. . ఇది జరిగిన 70 ఏళ్లకు … కానిస్టేబుల్ అయిన సూరి (విజయ్ దేవరకొండ).. పన్నెండేళ్ళ క్రితం ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తన అన్న శివ (సత్యదేవ్) ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని తాపత్రయ పడుతుంటాడు. అతను శ్రీలంకలోని జాఫ్నాలో శ్రీకాకుళం నుండి వెళ్ళిన తెగకు నాయకుడిగా ఉన్నాడని, అతన్ని కలుసుకుని, భారతదేశానికి తెచ్చుకోమని ‘రా’ అధికారి చెబుతాడు. అయితే ఇది అండర్ కవర్ ఆపరేషన్ గాజరుగుతుంది. అక్కడి నుండి ఎన్నో ట్విస్ట్ లతో సాగేదే ‘కింగ్ డమ్’ కథాంశం. సినిమా ఫస్ట్ హాఫ్ అద్భుతంగాతీసారు, సెకండ్ హాఫ్ మాత్రం కాస్త మసాలా తగ్గింది. సన్నివేశలలో కసి తగ్గింది.ఇక సూరి పాత్రలో విజయ్ దేవర కొండా అల్ రౌండర్ ప్రతిభ తో విశ్వరూపం చూపించాడు. మాస్ ప్రేక్షకులకు ‘ఛత్రపతి’ స్థాయి ప్రభాస్ ను చూపించాడు. అన్నను సూరి కలవడం కోసం చేసే ప్రయత్నం, సమస్యలను ఎదుర్కొన్న తీరు చూస్తే గూజ్ బంప్స్ వస్తాయి. అన్న పాత్రలో సత్యదేవ్ బాగా ఇమిడిపోయాడు. అందాల హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. మురుగన్ పాత్రలో వెంకిటేష్ వి. పి. చాలా అద్భుతంగ డిఫెరెంట్ గా చేశాడు. ఇతర పాత్రలను రోహిణి, అయ్యప్ప పి శర్మ, తదితరులు చక్కగా చేశారు. అనిరుథ్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు పెద్ద హైలైట్.. బిజియం సినిమా చుసిన ప్రేక్షకులను వెంటాడుతుంది. గిరీశ్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, జోమోన్ టి జాన్ సినిమాటోగ్రఫీ బాగుంది. మొత్తం మీద సినిమా క్వాలిటీ ప్రేక్షకుడు పెట్టిన టికెట్ ఖర్చుకు సంతృప్తి కలిగిస్తుంది.
