సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ భీమవరం కొత్త బస్ స్టేషన్ నుండి శ్రీశైలం నూతన సూపర్ లగ్జరీ సర్వీసును ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి అంజి బాబు గత రాత్రి 8 గంటలకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. క్రొత్తగా నర్సాపురం నుండి శ్రీశైలం సూపర్ లగ్జరీ సర్వీస్ ప్రారంభించామని, నర్సాపురం – పాలకొల్లు – భీమవరం – విజయవాడ – గుంటూరు – నర్సరావుపేట – వినుకొండ – కుంట- దోర్నాల మీదుగా శ్రీశైలం వెళ్ళే ఈ సర్వీసును నరసాపురం, పాలకొల్లు, భీమవరం పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు, శివ భక్తులు ఈ సర్వీసును సద్వియోగం చేసుకోవాలని అన్నారు. నరసాపురంలో రాత్రి 07.00 గంటలకు బయలుదేరి శ్రీశైలం పుణ్యక్షేత్రంనకు ఉదయం 08.00 గంటలకు చేరుకొని తిరిగి శ్రీశైలం నుండి రాత్రి 07-45 గంటలకు బయలుదేరి భీమవరంఉదయం 8 గంటలకు మీదుగా ఉదయం 08.45 గంటలకు నరసాపురం చేరుకుంటుందని తెలిపారు. ప్రయాణికులు ఈ సర్వీసును ఉపయోగించుకోవలెనని, ఈ సర్వీసుకు ఆన్ లైన్ బస్ రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులో ఏర్పాటు చేయడమైనదని అన్నారు. కూటమి నాయకులు ఆర్టీసి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *