సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి.. దేశం లో బీజేపీ గెలుపు కోసం ఎన్నికల సంఘం అక్రమాలు అంటూ తన వద్ద ఆధారాల లెక్కలను భారీ స్క్రీన్ ఫై ప్రదర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు, గురువారం AICC ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు. తమ టీమ్ 6నెలల పాటు విచారణ చేసి ఈసీ ఓట్ల చోరీకి పాల్పడినట్లు బలమైన ఆధారాలను సేకరించిందని వాటిని వివరించారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ ఎన్నో అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. ఎన్నికలలో తన ఓటమిపై అనుమానం ఉన్న అభ్యర్థులకు గత 10-15 ఏళ్ల మెషిన్-రీడబుల్ డేటాను, సీసీటీవీ ఫుటేజ్‌ను ఈసీ ఇవ్వకుంటే వారు నేరం చేసినట్లేనని కానీ ఇటీవల జరుగుతున్నా ఎన్నికలలో ఎన్ని పిర్యాదులు చేసిన ఎవరికీ EVM లకు సంబంధించి కానీ ఇతరత్రా ఏ ఫుటేజీ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు లో అసలు పడిన ఓట్ల కన్నా ఎక్కువ శాతం ఓట్లు పడుతున్నాయని ఆరోపించారు. హర్యానా, మధ్యప్రదేశ్‌లో, మహారాష్ట్ర లోను.. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్‌కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని అన్నారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం అలాగే మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ల డేటాను విశ్లేషించామని తెలిపారు. ఆ లోక్‌సభ మొత్తంలో కాంగ్రెస్‌కు 6,28,208 ఓట్లు రాగా బీజేపీకి 6,58,915 ఓట్లు వచ్చాయని తెలిపారు. నిజానికి ఆ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఆరుచోట్ల గెలిస్తే.. ఒక్క మహదేవ్పుర అసెంబ్లీ స్థానంలో మాత్రం 1,14,000 ఓట్ల తేడాతో ఓడిపోయిందని తెలిపారు. ఇక్కడ ఓటింగ్ విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపించారు. మహారాష్ట్రలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య వ్యవధిలో ఏకంగా 40 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారని పేర్కొన్నారు. కర్ణాటకల ఒకే సింగిల్ బెడ్రూం ఇంట్లో 48 ఓట్లు ఎలా వచ్చాయంటూ? ప్రశ్నించారు. ఇంటి నెంబర్ ‘0’ తో కూడా వంద ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. బెంగళూరు సెంట్రల్ సహా ఏడు ఎంపీ స్థానాల్లో అనూహ్యంగా ఓడిపోయామన్నారు. మహదేవ్‌పూర్‌లో 40 వేలు ఫేక్ ఓట్లు దొరికాయని ఒకే అడ్రస్‌తో 10వేలకు పైగా ఓటరు కార్డులున్నాయని ఆరోపించారు. అలాగే తాజాగా బీహార్ ఓట్ల తొలగింపుపై కూడా ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
