సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి పై అమెరికా 50 శాతం పన్ను విధించడంతో రైతులను ఆదుకోవాలని భీమవరంలో నేడు, సోమవారం కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ తో సమావేశం అయ్యి ఆయనకు వినతిపత్రం ఇచ్చారు ఆక్వా రైతులు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వారితో మాట్లాడుతూ.. రొయ్యల రైతుల కష్టాలు నాకు స్వయంగా తెలుసునని , గతంలో ఉన్న మంచి పరిస్థితులు ఇప్పుడు లేవు.. నావరకు అయితే గతంలో 80 ఎకరాలు సాగు చేసి నాలుగు కోట్లు నష్టపోయిన అనుభవం నాకు ఉంది.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున రంగం ఆక్వా రంగం.. ఆక్వా రంగానికి నష్టం వస్తే మార్కెట్లో అన్ని రంగాలపై ఆ ప్రభావం ఉంటుంది. అయితే ఇటీవల అమెరికా మన ఉత్పత్తులపై 50 శాతం పన్ను విధించడం తో కొత్త ఇబ్బందులు వస్తున్నాయి. ఆందోళన చెందకండి. గతంలో ఇదే రకంగా అమెరికా వ్యవహరించిన సమయంలో ఎలా దారికి తీసుకువచ్చారో ఇపుడు అదే రకంగా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా రైతులకు సబ్సిడీకి కరెంట్, ఫీడ్ ధర తగ్గించి రైతులను ఆదుకునే విధంగా సీఎం దృష్టికి మరియు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ తో సమావేశమై ఆక్వా రైతుల ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువెళ్తాను అని హామీ ఇచ్చారు.
