సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బివి రాజు ఎడ్యుకేషన్ విద్యాసంస్థలలో విద్యార్థులు నేడు, బుధవారం భారత స్వతంత్ర వేడుకల నేపథ్యంలో తిరంగా ర్యాలీని నిర్వహించారు. శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ (SVES),మరియు SPIC MACAY మరియు హెరిటెల్ క్లబ్ SVES సంయుక్తంగా, ప్రసిద్ధ యక్షగాన కళాకారుడు శ్రీ కిరమణి శివరంగ హెర్జే గారు మరియు వారి ప్రతిభావంతమైన బృందం (బెంగళూరు) అందించిన అద్భుతమైన యక్షగాన ప్రదర్శనను నిర్వహించింది. బి. వి. రాజు ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమం, కర్ణాటక సాంప్రదాయ నాటకరూపమైన యక్షగానాన్ని సంగీతం, నృత్యం, కథా వర్ణనల, కళాకారుల వాహభావాలతో సమ్మితం చేసి సమ్మేళనంగా సజీవంగా ప్రదర్శించింది. ప్రముఖ యక్షగాన నిపుణుడు కీరమణి శివరంగ హెరే సభను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ కళారూపంపై తన అభిరుచి, మరియు ఇటువంటి సంప్రదాయాలను నిలుపుకోవడం ఎంత ముఖ్యమో పంచుకున్నారు. ఆయన బృందం ప్రదర్శన పురాణ గాథలు, నాటకీయ భావవ్యక్తీకరణలు, అద్భుతమైన వేషధారణలతో మంత్రముగ్ధుల్ని చేసింది. కార్యక్రమం మొత్తం విద్యార్థులు ప్రేక్షకులతో నుండి ఘనమైన చప్పట్లతో ప్రశంసలు అందుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *