సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నరసాపురం వైపు నుండి ప్రజలు కోనసీమ రాజోలు వైపు వెళ్లాలంటే చించినాడ వంతెన ఎంత కీలకమో అందరికి తెలిసిందే. అయితే వాహన దారులకు ముఖ్య సూచనా.. ఉభయ గోదావరి జిల్లాల మధ్య దిండి-చించినాడ మధ్య వశిష్ఠ గోదావరి నదిపై ఉన్న వారధిపై ఈ నెల 18, 21 తేదీల్లో పూర్తిగా ట్రాఫిక్‌ను నిలుపుదల చేస్తున్నట్టు కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌బాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ 2 రోజుల పాటు పూర్తిగా ఈ వారధిపై ఎటువంటి వాహనాల రాకపోకలు ఉండవని స్పష్టం చేశారు. వారధికి సంబంధించి బేరింగ్ రిప్లేస్‌మెంట్ మరమ్మతుల దృష్ట్యా.. వారధి మీదుగా మోటారు సైకిల్‌తో సహా ఏ ఒక్క వాహనం ప్రయాణించడానికి వీలు ఉండదన్నారు. జాతీయ రహదారి 216లో ఉన్న దిండి-చించినాడ మధ్య వారధికి సంబంధించి బేరింగ్ రిప్లేస్‌మెంట్ మరమ్మతుల దృష్ట్యా 2 రోజులు ట్రాఫిక్ నిలుపుదల అనివార్యమైనట్టు కలెక్టర్ తెలిపారు.
