సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జమ్మూకాశ్మీర్ కిష్టావర్ జిల్లా పద్దార్ సబ్ డివిజన్ పరిధిలోని చిషోటీ గ్రామ పరిసర ప్రాంతంలో నేటి గురువారం అకస్మాత్తుగా మేఘ విస్ఫోటనం సంభవించింది. ఆ నేపథ్యంలో, అకస్మాత్తుగా మీద పడిన వరద నీటితో 34 మంది మరణించారు. 73 మంది తీవ్రంగా గాయపడ్డారు. మాచైల్ మాతా యాత్ర మార్గంలో ఈ గ్రామం ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం ఆ ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను మెరుగైన వైద్య చికిత్స కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి జిల్లా యంత్రాంగం తరలించింది. మేఘ విస్పోటనం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై గవర్నర్, సీఎంలతో కేంద్ర మంత్రి అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారు. కేంద్ర భద్రతాబలగాలు పోలీసులు సంయుక్తంగా ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
