సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానానికి ధర్మకర్తల మండలి నియామకానికి దేవదాయ ధర్మాదాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానoకు ధర్మ కర్తల మండలి సభ్యులను నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హిందూ మతమునకు చెందిన 13 మందిని ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వారి దరఖాస్తులను ఆలయ కార్యాలయం నందు అందచేయవలసి ఉంటుంది దరఖాస్తులు దేవస్థానం కార్యాలయ పనివేళల నందు పొందవచ్చును ఇతర వివరాలుకు కార్యాలయం నందు తెలుసుకోవలసినదిగా దేవస్థానం సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. ( నిజానికి భీమవరంలోని కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులు ఎన్నికకు సహకరించిన పార్టీల నేతలతో పాటు తొలిసారిగా ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు కూడా శ్రీ అమ్మవారి దేవాలయ ధర్మకర్తల మండలి లో సభ్యత్వం కోసం ఫై స్థాయి సిఫార్స్ లతో పోటీ పడుతుండటం గమనార్హం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *