సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, శనివారం ఉదయం దర్శించుకున్న మోగల్లు గ్రామానికి చెందిన P బలరామకృష్ణం రాజు జానకి దంపతులు 8 గ్రాముల బంగారం కానుకగా అందించారు. వీరికి ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదాలు ఫోటో వీరికి అందచేసారు.
