సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆగస్టు 15 నుండి వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తిపోతున్నారు. మొన్న శుక్రవారం నుంచి కొనసాగుతున్న భక్తుల రద్దీ నేడు, ఆదివారం అంతకంతకు పెరుగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం భక్తులకు గగనం అవుతుంది. టోకెన్ లేని భక్తులు స్వామివారిని సర్వదర్శనం చేసుకోవాలంటే 48 గంటల సమయం పడుతుందని టిటిడి ప్రకటించింది. దీనితో కొందరు భక్తులు కొండా ఎక్కిన తరువాత దేవాలయానికి నమస్కారం చేసి యాత్ర ను సరిపెడుతున్నారు. ఆక్టోపస్ బిల్డింగ్ సర్కిల్ వరకు ఉన్న భక్తుల క్యూ లైన్ అలానే కొనసాగుతోంది. గత శనివారం ఉదయం నుంచి వైకుంఠం 2, నారాయణగిరి షెడ్ల లో నిండిపోయిన భక్తులు ఆక్టోపస్ బిల్డింగ్ సర్కిల్ వరకు ఉన్న భక్తుల క్యూ లైన్ కొనసాగుతూనే ఉంది.నేడు, ఆదివారం మరింత భక్తులు చేరుకోవడంతో టీడీడీ వసతి దర్శనం విషయంలో ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంది. గంటకు 4,500 మందికి భక్తులకు మాత్రమే దర్శనం చేయించగలుగుతున్నారు.భక్తులకు టిటిడి క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో నిరంతరాయంగా శ్రీవారి సేవకుల ద్వారా అన్న పానీయాలు పంపిణీ చేస్తుంది. నిన్న శనివారం ,నేటి తెల్లవారు జామున శ్రీవాణి కౌంటర్ వద్ద టిక్కెట్లు దొరక్క ఆందోళనకు దిగిన పరిస్థితి ఏర్పడింది. తిరుమలలోని శ్రీవాణి కౌంటర్స్ లో ఆఫ్ లైన్ 800 టికెట్లను జారీ చేస్తున్న టీటీడీ నిర్దేశించిన సమయంలో టికెట్లు జారీ చేయకపోవడంతో భక్తుల్లో గందరగోళానికి కారణమైంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *