సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నిన్న నేడు, సోమవారం భారీ వర్షాలు లేకపోయినా వర్షపు జల్లులతో చలిగాలులతో వాతావరణం ముసురు కమ్ముకొంది. తాజా సమాచారం ప్రకారం పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం నేటి సోమవారం రాత్రి వాయుగుండంగా బలపడుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రేపు . మంగళవారం ఉదయానికి వాయుగుండంగా దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని కోస్తా తీరంలోని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు.నరసాపురం , భీమవరం లోని సముద్ర తీరా ప్రాంతాలలోఅధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేసారు. దీని ప్రభావంతోరేపటి మంగళవారం గోదావరి జిల్లాలలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల్లో, మన రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదుల వరద ప్రవాహం హెచ్చరిక స్థాయికి చేరుకొంటున్నాయి. ప్రజలు అప్రమత్తతతో ఉండాలి.
