సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) నేడు, సోమవారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి ఫోన్ చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించే విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పుతిన్ గత శుక్రవారం నాడు అలస్కాలో సమావేశమైన అనంతరం, తొలిసారి మోదీకి ఫోన్ చేసి తాను ట్రంప్ తో చర్చించిన విషయాలను తెలిపారు. 2022 ఫిబ్రవరి నుంచి రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై భారత వైఖరిని ప్రధాని పునరుద్ఘాటించారని, శాంతియుత తీర్మానం చేసుకోవాలని సూచించారని ప్రధాని కార్యాలయం తెలిపింది..’మిత్రుడు పుతిన్ ఫోన్ చేసి అలస్కాలో ట్రంప్‌తో జరిగిన సమావేశం వివరాలను పంచుకున్నందుకు థాంక్స్. ఉక్రెయిన్ ఉద్రిక్తతలకు శాంతియుత పరిష్కారం చేసుకోవాలని ఇండియా ఎప్పటికప్పుడు చెబుతోంది. ఇందుకు అన్నివిధాలా మా సహకారం ఉంటుంది’ అని మోదీ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *