సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కురిసిన వర్షాలకు మరోసారి అమరావతి రాజధాని గోదావరి నదిలా మారిపోయిందని, అయిన కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేస్తానని చెపుతుందని, ఇక అమరావతి ప్రాంతంలో పులస చేపలు కూడా దొరుకుతాయని మరో రెండు ఏళ్లలో అమరావతిలో మేము పులస చేపలు పడతాం. మీ అందరికీ పంచిపెడతాం. ఇక్కడ గోదావరి పొంగినట్టు అక్కడ వరద పొంగుతోంది’ అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని గత సోమవారం వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, సుగాసి బాలసుబ్రహ్మణ్యం ములాఖత్‌లో కలిశారు. అనంతరం కేతిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అమరావతిపై ఈతరహా వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *